సమంత రూత్ ప్రభు తొలి ఐటెమ్ నంబర్ " ఊ అంటావా" వివాదం రేపింది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వీక్షణలను సంపాదించుకున్న పాట గురించి, సమంత డ్యాన్స్‌పై కొందరు వ్యక్తులు కేసు పెట్టారు.ఈ చిత్రం విడుదలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో వివాదంపై అందరి దృష్టి పడింది. ఆ లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని గుర్తించిన పురుషుల సంఘం ఆంధ్రప్రదేశ్‌లో కేసు దాఖలు చేసింది. ఈ సాహిత్యం పురుషులను కామపురుషులుగా చూపిందని, పాటపై నిషేధం విధించాలని కోరింది. ఈ వ్యవహారం ఇంకా కోర్టులో తేల్చాల్సి ఉంది. ఈ సాంగ్ ను చంద్రబోస్ లిరిక్స్ రాశారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాట సంగీత ప్రియులలో ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది. అయితే ఇప్పుడు చట్టపరమైన చిక్కుముడి పడడం మేకర్స్‌కు కూడా షాక్‌గా మారింది. మరి ఈ విషయంపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప- పార్ట్ 1 డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa