ఈ రోజు దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ భీమ్లా నాయక్ టీమ్ పోస్టర్ ని ఇంకా న్యూ టీజర్ ని 'హ్యాపీ బర్త్ డే డానియెల్ శేఖర్' అంటూ విడుదల చేసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరియి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు, నిత్యామీనన్ మరియు సంయుక్త మీనన్ కదా నాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ పర్యవేక్షకుడు. ఆయనే మాటలందించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియమ్ కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసినదే. ఈ రోజు దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా విడుదల అయిన టీజర్ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa