రాబోయే 'ఆర్ఆర్ఆర్' మూవీని నిర్మించిన నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్ తన తదుపరి ప్రాజెక్ట్ లో దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి పనిచేయనుంది.
ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్టు మేకర్స్ మంగళవారం ప్రకటించారు. 'ఛలో', 'భీష్మ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో 'చిరు156' అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఫిక్స్ చేసారు. చిరంజీవి కూడా ఓకే చెప్పారని సమాచారం. DVV ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రాబోయే సినిమా ను నిర్మించనుంది
'డివివి' ఎంటర్‌టైన్‌మెంట్ సహ-నిర్మాత డా. మాధవి రాజు ఈ విధంగా ట్వీట్ చేసారు.
"విజయవంతమైన దర్శకుడు @వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ @KChiruTweets గారితో కలిసి ఒక సినిమాని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దీనితో మా కల నెరవేరింది. త్వరలో ఈ సినిమా రోలింగ్' అవుతుందని అని రాశారు.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ట్వీట్‌ను చూసి, వెంకీ కుడుముల ఇలా ట్వీట్ చేసారు, "ఇలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి! నాకు వచ్చినదుకు ధన్యవాదాలు @KChiruTweets సార్." "నాపై మీకున్న నమ్మకం మరియు మీ పట్ల నాకున్న అభిమానం నన్ను నా సామర్థ్యం మేరకు పని చేసేలా చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు @DVVMovies మరియు డా. మాధవి రాజు గారూ ధన్యవాదాలు!" అని వెంకీ కుడుముల ట్వీట్ చేసారు. అయితే ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’, సినిమా షూటింగ్‌లో ఉన్నారుఇంకా ‘ఆచార్య’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa