ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు ‘బంగార్రాజు’లతో 'చిట్టి'.. ఐటమ్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 05:48 PM

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నమూవీ  ‘బంగార్రాజు’ తాజాగా మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. 'ది పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్' పేరుతో, 'బంగార్రాజు' మేకర్స్ రాబోయే లిరికల్ సాంగ్ యొక్క చిన్న క్లిప్ విడుదల చేశారు, ఇందులో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫారియా అబ్దుల్లా నటించారు.

మోషన్ పోస్టర్‌ను, ఫారియా ఒక వైపు నాగార్జున మరియు మరోవైపు నాగ చైతన్యతో ఈమె స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. డిసెంబర్ 17న లిరికల్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు మేకర్స్. నాగార్జున తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ  విషయాన్ని ప్రకటించారు. “#బంగార్రాజు నుండి ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ మ్యూజికల్ పోస్టర్. డిసెంబర్ 17న 17.12 గంటలకు సాంగ్ టీజర్!” అని నాగార్జున  ట్వీట్ చేసారు.
గతంలో నాగార్జున మరియు నాగ చైతన్య కోసం క్లాసిక్ మ్యూజికల్ ఆల్బమ్ 'మనం'ని అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘బంగార్రాజు’లో రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa