బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా ఈ సీజన్ విజేత ఎవరు అనే అంశంపైనే చర్చ సాగుతోంది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవవచ్చని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. ఇప్పుడు పక్కా విజేత ఎవరో కూడా తెలిసిపోయింది. రేపు విజేతగా నిలువబోతున్న కంటెస్టెంట్ ఎవరు అనే విషయంలో కూడా లీక్ వచ్చింది. బిగ్ బాస్ గురించి ఎన్నో లీక్ లు వచ్చాయి. అందులో 90 శాతంకు పైగా నిజం అయ్యాయి. కనుక ఈ లీక్ నిజం అయ్యి ఉండవచ్చు అనడంలో సందేహం లేదు. ఆ లీక్ అనుసారం బిగ్ బాస్ సీజన్ 5 కి విజేత సన్నీ. అతడిని ప్రేక్షకులు విజేతగా నిలిపారట. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో సన్నీకి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యాయి. ముందు నుండి అనుకుంటున్నట్లుగా సన్నీ మరియు షన్నూల మద్య పోటీ తీవ్రంగా నెలకొంది. సన్నీకి 34 శాతం ఓట్లు రాగా షన్నూ కు 31 శాతం ఓట్లు నమోదు అయ్యాయట. ఆ తర్వాత స్థానంలో శ్రీరామ చంద్ర ఉన్నాడు. నాల్గవ స్థానంలో అంతా ఊహించినట్లుగా మానస్.. చివరి స్థానంలో సిరి నిలిచింది. సిరి మరియు షన్నూల మద్య వ్యవహారం కారణంగా సన్నీ విజేతగా గెలువబోతున్నాడు అనేది చాలా మంది అంటున్న మాట. యూట్యూబ్ సూపర్ స్టార్ గా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తో బిగ్ బాస్ లోకి వెళ్లిన షన్నూ ఎక్కువగా సిరి తో కలిసి ఉండటం.. ఆమె తోనే ఆట అన్నట్లుగా ఉండటం వల్ల విజేత అయ్యే అవకాశంను కోల్పోయాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో సన్నీ అనూహ్యంగా పుంజుకోవడంతో పాటు అతడి ప్రవర్తన అందరికి నచ్చింది. ఎవరితో అయినా గొడవ పడితే వెంటనే దాన్ని సరి చేసుకోవడం మొదలుకుని ఏం జరిగినా టాస్క్ వరకే అన్నట్లుగా ఉంటాడు. టాస్క్ ల్లో అద్బుతంగా పాల్గొనడంతో పాటు ప్రతి ఒక్క సందర్బంలో కూడా తన యొక్క హుందాతనంను ప్రదర్శించాడు. ప్రతి ఒక్కరికి నచ్చే కంటెస్టెంట్ అంటూ సన్నీ పేరు తెచ్చుకున్నాడు. అమ్మాయిల నుండి ఆంటీల వరకు సన్నీ ని నెత్తిన ఎత్తుకుని మరీ విజయాన్ని కట్టబెట్టారు అనేది విశ్లేషకుల వాదన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa