ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నిరాశ!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 21, 2021, 11:53 AM

పవన్ కళ్యాణ్ అభిమానులకు బాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేయాలని పవన్ కళ్యాణ్‌ని, చిత్ర నిర్మాతను కోరినట్లు నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. తమ విన్నపానికి పవన్ కళ్యాణ్, నిర్మాత రాధాకృష్ణ సానుకూలంగా స్పందించారని దిల్ రాజ్ తెలిపారు. తమ విజ్ఞప్తిని మన్నించినందుకు పవన్ తో పాటు భీమ్లా నాయక్ చిత్ర బృందానికి దిల్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండగా.. సంక్రాంతి బరిలో తమ అభిమాన హీరో బరిలోకి దిగుతాడని భావించిన పవన్ అభిమానులకు ఈ వార్త నిరాశే మిగిల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa