ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే.బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఉదయభాను. కానీ ఉన్నట్టుండి సడెన్‌గా ఇండస్ట్రీ నుంచి మాయమైంది. పెళ్లయ్యాక ఇండస్ట్రీకి దూరమైన ఉదయభాను.. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన ఉదయభాను.. ఇప్పుడు వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతుంది. ఉదయభాను స్లో అయిన తర్వాతే యాంకర్ సుమ టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై ఉదయభాను కనిపించింది. ఈ మధ్య మళ్లీ చిన్న చిన్న ఈవెంట్స్ లో కనిపిస్తుంది ఉదయభాను. కానీ గుర్తు పెట్టుకునే ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఇలాంటి సమయంలో మొన్న రిలీజైన బాలయ్య అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈమె సరిగ్గా కాన్సన్‌ట్రేట్ చేస్తే బిజీ అవుతుందని అంటున్నారు ఉదయభాను అభిమానులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa