నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇటీవలే ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ షోగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ మాలో ప్రసారమైన ఈ సినిమా తొలి టీఆర్పీతో సాలిడ్ గా నిలిచింది. ఈ చిత్రం టెలివిజన్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, మొదటిసారిగా 18.01 టీఆర్పీ చేసింది. లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa