ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాట చిత్రీకరణలో.. ఖిలాడి చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 12, 2022, 08:01 PM

పాట చిత్రీకరణలో హీరో రవితేజ నటిస్తున్న ఖిలాడి చిత్రం షూటింగ్ జరుగుతోంది. రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి నాయికలుగా సందడి చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీసా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఆ తరువాత రవితేజ .. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' చేస్తున్నాడు. శ్రీలీల కథానాయికగా ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా 'రావణాసుర' సినిమా ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ సినిమాతో పాటు 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను కూడా రవితేజ లైన్లో పెట్టేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa