ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య అభిమానులకు డైరెక్టర్ బోయపాటి సారీ!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 12, 2022, 08:11 PM

బాలకృష్ణ అభిమానులను దర్శకుడు బోయపాటి శ్రీను సారీ చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బోయపాటి, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అభిమానులను ఈ ఈవెంట్ కు పిలవలేకపోయినందుకు క్షమించాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమయిందని... సక్సెస్ మీట్ కు రమ్మంటే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేస్తారని, వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈవెంట్ కు పిలవలేదని చెప్పారు. ఫ్యాన్స్ బాగుండాలనే వారిని పిలవలేదని అన్నారు. ఈవెంట్ కు పిలవనందుకు తమను క్షమించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa