ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 09:22 PM

ఆనంద్ దేవర కొండ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఫస్టుమూవీ 'దొరసాని' సినిమా మంచి కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గడీల పెత్తనం .. పేదవాడి ప్రేమతో ముడిపడిన ఈ కథ యూత్ కు కొంతవరకు బాగానే కనెక్ట్ అయింది. అయితే ఆశించినస్థాయిలో మాత్రం వర్కౌట్ కాలేదు. కథలో పాత్రకి తగినట్టుగానే చేశాడనే పేరు కొట్టేశాడు. ఆ తరువాత చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మాత్రం, సినిమాకి సరిపడే కంటెంట్ కాదనే విమర్శలను మూటగట్టుకుంది. ఇక 'పుష్పక విమానం' సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ ఎందుకనో రిలీజ్ కి ముందుగానీ .. ఆ తరువాత గాని ఎవరూ కూడా ఆ సినిమాను గురించి మాట్లాడుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి రావడానికి 'హైవే' సినిమా రెడీ అవుతోంది. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా, కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయమవుతోంది. ఇక ఆ తరువాత ఆయన ఒక కొత్త దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాకి రచయితగా పనిచేసిన సాయిరాజేశ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎస్ కేఎన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa