ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 రోజులు పూర్తి చేసుకున్న 'అఖండ'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 20, 2022, 01:17 PM

కరోనా రెండుసార్లు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమను కూడా దారుణంగా దెబ్బతీసింది. షూటింగ్స్ ఆగిపోయి, థియేటర్లు మూతబడి, కంప్లీట్ చేసుకున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో, లేదో, ఓటీటీలో రిలీజ్ చేస్తే బెటర్ అనుకుంటూ నానా ఇబ్బందులు పడ్డారు మేకర్స్ కట్ చేస్తే, సరైన సాలిడ్ సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకాభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గదని నిరూపించింది 'అఖండ' మూవీ. సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన స్టార్ హీరో, సీనియర్ హీరో సినిమా 'అఖండ' బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య-బోయపాటిల కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం 'అఖండ' ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యని విధంగా బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ నెలకొల్పింది.


ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. డిసెంబర్ 2న విడుదలైన 'అఖండ' జనవరి 20తో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒక సినిమా రెండు వారాలపాటు థియేటర్లలో ఉండడం, పదవ రోజు పోస్టర్ పడడం అనేది కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఏకంగా 50 రోజుల పోస్టర్ వేసాడు బాలయ్య.


'అఖండ'గా బాక్సాఫీస్ బరిలో మరో రేర్ రికార్డ్ సెట్ చేసాడు బాలయ్య. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ వసూళ్లు, హక్కులు అన్నీ కలిపి రూ.200 కోట్ల మార్క్‌ని టచ్ చెయ్యడం విశేషం. తన ఇమేజ్‌కి తగ్గట్టు సరైన మాస్ సినిమా పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో 'అఖండ' ద్వారా శాంపిల్ చూపించాడు బాలయ్య.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa