ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంగాఓణీలో జబర్దస్త్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 20, 2022, 01:28 PM

ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన యాంకర్ 'అనసూయ భరద్వాజ్'  షోకి వచ్చిన అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్‌తో బాగా పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా దూసుకుపోతున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనుకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అనసూయ భరద్వాజ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ టీవీ షో, సినిమా, సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో రచ్చ చేస్తారు. పొట్టి దుస్తులు వేసినా, సారీ కట్టినా, లంగాఓణీ అయినా జబర్దస్త్ బ్యూటీ అందమే వేరు. తాను ధరించే డ్రెస్సులపై నెటిజన్లు ఎన్ని కామెంట్లు చేసినా.. వారికీ ధీటుగా బదులు ఇస్తూ దూసుకుపోతారు. తాజాగా అనసూయ భరద్వాజ్ లంగాఓణీలో తళుక్కుమన్నారు. ఈరోజు ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కోసం లంగాఓణీ వేసిన అను.. ఆహా అనిపిస్తున్నారు. నడుము ఒంపులు, నాభి అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. మెరూన్ అండ్ బ్లాక్ లంగాఓణీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ ఫొటోలకు లైకుల వర్షం కురుస్తోంది.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa