సినిమా ఇండస్ట్రీలో పడకగది పిలుపులు ఉన్నాయని #MeToo పేరుతో పెద్ద ఉద్యమే జరిగింది. జరుగుతుంది కూడా. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. అన్ని ఇండస్ట్రీలో ఈ పాడు సంస్కృతి ఉందని కొందరు హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చారు. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ధైర్యంగా పంచుకున్నారు. కొందరిపై సంచలన ఆరోపణలు చేశారు. వీరిలో కొందరికి శిక్ష కూడా పడింది. తాజాగా హాట్ బ్యూటీ అప్సర రాణి తనకు ఎదురైన పడక గది అనుభవాన్ని పంచుకుంది. బెంగళూరుకి చెం దిన ఓ డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తానని పిలిచి.. | తనతో గడిపితేనే అవకాశం ఇస్తానని కండీషన్ పెట్టాడట. అయితే ఆ డైరెక్టర్ పేరుని మాత్రం అప్సర బయటికి చెప్పలేదు. రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తెచ్చిన ఈ అందం.. గత ఏడాది రవితేజ 'క్రాక్' ఐటమ్ సాంగ్ మెరిసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa