ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి రీపెట్ కానున్న మహేష్‌తో గోపీచంద్ విలనిజం!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 21, 2022, 07:53 PM

ఒకప్పుడు మొదట విలన్ పాత్రల్లో మెప్పించి, ఆ తర్వాత హీరోలుగా మారి స్టార్ డమ్ అందుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ గతంలో మహేష్ 'నిజం'లో విలన్‌గా నటించాడు. అయితే మరోసారి ఈ కాంబినేషన్ రీపెట్ కానున్నది టాలీవుడ్ టాక్. మహేష్‌తో  గోపీచంద్ తన పవర్ ఫుల్ విలనిజం చూపించనున్నాడని తెలుగు సినీ ఇండస్ట్రీ టాక్.  
గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రలతో మెప్పించాడు. ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించాడు. అలాంటి గోపీచంద్ మళ్లీ పవర్‌ఫుల్ విలన్‌గా .. రాజమౌళి సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్‌ని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ గతంలో మహేష్ 'నిజం'లో విలన్‌గా నటించాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ మళ్లీ కలుస్తుందని అంటున్నారు. అయితే వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa