ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు...?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 01:39 PM

సింగర్ సునీత డిజిటల్ వ్యాపారవేత్త రామ కృష్ణ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. డిసెంబర్ 2020లో సౌత్ బేస్డ్ సింగర్ సునీత రామ్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.  అప్పట్లో ఈ పెళ్లి వార్త బ్రేకింగ్ న్యూస్ లాగా మారింది.  ఇప్పుడు,సింగర్ సునీత కొడుకు ఆకాష్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని బ్యాంక్రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆకాష్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యాక్టింగ్ కోర్సు చేస్తున్నాడు అని సమాచారం. చూడాలి మరి ఇందులో ఎంత వరకు నిజమో...?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa