కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మరో చిత్రంతో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సైబ్ చక్రవర్తి దర్శకత్వం వస్తునా ఈ సినిమాకి "డాన్" అని టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, సముద్రఖని, సూరి, శివాంగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా నుండి ఒక వీడియో ని రిలీజ్ చేస్తు సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసారు. ప్రస్తుతం తన టాలీవుడ్ డెబ్యూ మూవీని‘ఎస్‌కె 20’ పేరుతో జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్‌తో కలిసి శివకార్తికేయన్ పనిచేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa