"హిట్","ఈ నగరానికి ఏమైంది", "పాగల్" వంటి సినిమాలో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్ "అశోక వనంలో అర్జున కళ్యాణం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతునాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ యొక్క లేడీ లవ్‌గా రుక్సార్ ధిల్లాన్ నటిస్తోంది. ప్రోమోలు మరియు మెలోడియస్ సాంగ్‌తో ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు,తాజాగా "అశోక వనంలో అర్జున కళ్యాణం " మూవీ మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 2, 2022 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa