ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా సినిమా ఉన్నా సరే, రచ్చ అయన సినిమా లోనే అంటున్న కిరణ్ అబ్బవరం

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 03:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున"భీమ్లా నాయక్" సినిమా కోవిడ్-19 పరిస్థితిని బట్టి ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు ప్రకటించారు.మరికొన్ని సినిమాలు ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతున్నాయి.శర్వానంద్ "ఆడవాళ్లు మీకు జోహార్లు"  సినిమా ఫిబ్రవరి 25  విడుదల అని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల, హీరో కిరణ్ అబ్బవరం తన రాబోయే చిత్రం "సెబాస్టియన్ పిసి 524" అదే తేదీన థియేటర్లలోకి వస్తుందని  ప్రకటించారు.“ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రిలీజ్ ఉంది అని తెలీదా భయ్యా?? ఆ తేదీకి ఎలా వస్తునావ్? నువ్ పీకే ఫ్యాన్ అని ఎన్ని సర్లు చెప్పినావ్? ఏంది భయ్యా ఇది??  అని ఒక నెటిజన్ కిరణ్‌ను ప్రశ్నిస్తు ట్వీట్ చేశారు.దానికి కిరణ్ సమాధానమిస్తూ, “మీకంటే ఇంకా ఎక్కువే వెయిట్ చేస్తున్నా భీమ్లానాయక్ కోసం... నా సినిమా ఉన్నా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో రచ్చ అయన సినిమా లోనే”అన్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన సెబాస్టియన్ పిసి 524లో నమ్రత దారేకర్ మరియు కోమలి ప్రసాద్ కథానాయికలుగా నటించారు. జిబ్రాన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa