ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై స్పందించిన లావణ్య త్రిపాఠి!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 05:49 PM

టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ రోజే లావణ్యకు వరుణ్ ప్రపోజ్ చేశాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షించిన లావణ్య ఈ విషయంపై ప్రశ్నలు సంధించి ఆమె స్పందిస్తూ.. తన పెళ్లి ఎవరితో జరుగు తుందో తనకే  తెలియదన్నారు. నాకు తెలియనిది ఇతరులకు ఎలా తెలుసు అని అన్నారు. అయితే మీరు ఎవరితోనూ ప్రేమలో లేరని చెపుతున్నారా? అనే మరో ప్రశ్నకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa