కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఏ పాత్ర చేసిన అందులో జీవించేస్తాడు. హీరోయిన్ నయనతార అంతే. వీరిద్దరు కలిసి నటిస్తున్న తమిళ చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్' (#KaathuvaakulaRenduKaadhal). నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహి స్తున్నారు. సమంత మరో హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటికి కామెండీ ఎంటర్ టైనర్ ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది. ఇద్దరు హీరోయిన్స్ తో విజయ్.. ఓ రొమాంటిక్ పోస్టర్ ఒకటి షేర్ చేశారు. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa