మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత మహేష్ లైనప్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా అలానే మరో టాప్ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి ఎట్టకేలకు వీటిలో త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సాలిడ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ను ఈరోజు ఘనంగా లాంచ్ చేశారు.
హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం ఆరంభంకి గాను అట్టహాసంగా పూజా కార్యక్రమం సిద్ధం చేయగా దీనికి గాను దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ అలాగే హీరోయిన్ పూజా హెగ్డే మరియు మహేష్ బాబు సతీమణి నమ్రత లు హాజరయ్యి ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ని గ్రేస్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ చిత్రం లాంచ్ మహేష్ ఫ్యాన్స్ లో మంచి క్రేజీ గా మారగా ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa