ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న STR ( సింబు ) "పాతు తాలా" ఫస్ట్‌ గ్లింప్స్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:46 AM

కోలీవుడ్ నటుడు,సిలంబరసన్ థెసింగు రాజేందర్ ( సింబు )పుట్టినరోజు స్పెషల్ గా తన రాబోయే ప్రాజెక్ట్‌ల నుండి అప్‌డేట్‌లు ఇస్తున్నారు మూవీ మేకర్స్.ఈ సందర్భంగా ఆయన చేయబోయే సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్.రాబోయే ప్రాజెక్ట్స్లో ఒకటైనా "పాతు తాలా" అనే టైటిల్‌తో వస్తునా ఈ సినిమా రాజకీయ డ్రామాగా కనిపిస్తుంది.ఒబేలి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో గౌతం కార్తీక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కలైయరసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ ని ఎలివేట్ చేసింది మరియు విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి అని భావిస్తున్నారు.ఈ సినిమా గురించి వివరాలు త్వరలో మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa