త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం గురువారం జరిగింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది మహేష్ బాబుకి 28వ సినిమా. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత చినబాబు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమానికి మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.