కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మూడో లిరికల్ వీడియోకి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అందించింది. ఈ చిత్రానికి సంబంధించిన మూడో లిరికల్ వీడియో రోమియో జూలియట్‌ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa