తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రగతి ప్రేక్షకులకు సుపరిచితమే. తల్లి, భార్య, అత్త, ఇతర సహాయ పాత్రలలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మధ్య కాలంలో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఫిట్‌నెస్ వీడియోలతో అవాక్కయ్యేలా చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె ఫిట్‌నెట్ వీడియోలు, ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటితో పాటు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తోంది. ఈ క్రమంలో ఆమె చేసే వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. ఏ విషయమైనా ముక్కు సూటిగా చెబుతూ, ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తాను సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. దర్శక, నిర్మాతలతో పాటు, ఓ స్టార్ హీరో సినిమా అవకాశం కోసం తనతో గడపాలని అడిగినట్లు ఆమె చెప్పిన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే తాను లొంగకుండా సదరు హీరో నుంచి తప్పించుకున్నట్లు పేర్కొంది. తనను గడపమని అడిగిన హీరో పేరును మాత్రం వెల్లడించలేదని సమాచారం. ఏ ఇంటర్వ్యూలో ప్రగతి ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియడం లేదు కానీ, ఆ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో సైతం కాస్టింగ్ కౌచ్ ప్రగతి పలు వ్యాఖ్యలు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa