రాజశేఖర్ కథానాయకుడిగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శేఖర్'. ఫస్టులుక్ తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్రంలోని లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 'ఓసన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా .. కిన్నెరా .. ఓ కిన్నెరా అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ సాహిత్యంతో అనూప్ రూబెన్స్ స్వరపరచగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాట మొదటిసారి వినగానే నా హృదయాన్ని తాకింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa