పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ పరిస్థితిని బట్టి సినిమాను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేట్స్‌తో సంబంధం లేకుండా ట్రైలర్‌ని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. 2 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్‌లు, హై యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. రానా మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ సమాన స్క్రీన్ స్పేస్ పొందుతారని మరియు వారి ఘర్షణ సన్నివేశాలు ఈ ట్రైలర్‌లో హైలైట్ అవుతాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్ పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa