టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున బిగ్‌బాస్ షో కి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 5 చివరి ఎపిసోడ్ రోజు ఇంకా 2 నెలలలో మళ్లీ వస్తాను కానీ వేరే ఫార్మాట్‌లో వస్తాను అని చెప్పారు. అయితే చెప్పినట్లుగానే నాగ్ ఈ నెలలో బిగ్ బాస్ వేదికపైకి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది. డిస్నీ+హాట్‌స్టార్ బిగ్‌బాస్ షోను 24*7 ప్రసారం చేస్తుంది. ఈ ఫార్మాట్‌లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ OTT పాత మరియు కొత్త హౌస్‌మేట్ కుడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది OTT ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ప్రసారం చేయబడుతుంది. ఈ షో దాదాపు 84 రోజుల పాటు కొనసాగుతుందని మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa