ట్రెండింగ్
Epaper    English    தமிழ்

”భీమ్లా నాయక్” రిలీజ్ పై లేటెస్ట్ బజ్...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 12:01 PM

పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ పరిస్థితిని బట్టి సినిమాను ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కండీషన్స్ అనుకూలించిన వెంటనే సినిమా విడుదల చేయడం ఖాయమని, అందుకే రెండు డేట్స్ ఇచ్చామని చెప్పారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫిబ్రవరి 25న విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా ఒక అధికారిక క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa