చింతామణి నాటకాన్ని నిషేధించడం సరికాదు అని సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. శనివారం ఉయ్యూరు మండలం కడవకల్లు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు.
దేవదాసీ వ్యవస్థను నిర్మూలించే ఉద్దేశంతో రచించిన చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిషేధించడం సరికాదన్నారు. నాటకంలో ఏమైనా అసభ్య పదజాలం ఉంటే తొలగించాలి తప్ప నాటకాన్ని నిషేధించడలో అర్థం లేదన్నారు. ఎవరినైనా కించపరిచే విధంగా పాత్ర లు సంభాషణలు ఉంటే వాటిని మార్పు చేయాలి తప్ప ఇలా నిషేధించడం ఎంతవరకు సబబు అని నారాయణ మూర్తి ప్రశ్నించారు. సమాజంలో ప్రదర్శించే భాష నాటకాలు అలాగే టీవీలో వచ్చే అసభ్యకర షోలు పైన చర్యలు తీసుకోవాలి తప్ప ఒక మంచి ఉద్దేశంతో నారాయణ మూర్తి రచించిన చింతామణి నాటకం పై నిషేధం విధించడం ఏమిటని నారాయణ మూర్తి ప్రశ్నించారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి చింతామణి నాటకం పై నిషేధాన్ని ఎత్తి వేయాలని ఆర్ నారాయణమూర్తి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa