వివిధ భాషల్లో మార్చి 3వ తేదీన 'హే సినామిక'. విడుదల కానున్నది. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితిరావు హైదరీ నటించిన చిత్రం 'హే సినామిక'. కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హే సినామిక చిత్రం మార్చి 3న థియేటర్లలో రిలీజ్ అవుతుందని చిత్రబృందం నేడు వెల్లడించింది. అదే రోజున తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అవుతోందని తెలిపింది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు నిర్మించాయి. హే సినామిక చిత్రానికి తమిళ గీత రచయిత మదన్ కార్కీ కథ అందించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa