ఇటీవల విడుదలైన 'సెబాస్టియన్ PC 524' చిత్రం టీజర్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. యువ కథానాయకులలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం చాలా స్పీడ్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. వాటిలో ఓ మూడు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయన తాజా చిత్రంగా 'సెబాస్టియన్ PC 524' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. మదనపల్లిలోని ఒక పోలీస్ స్టేషన్ కి కానిస్టేబుల్ గా 'సెబాస్టియన్' వస్తాడు. అదే అతని మొదటి పోస్టింగ్. అయితే అతనికి రేచీకటి ఉంటుంది. ఆ విషయం ఎవరికీ తెలియనీయవద్దని తల్లి చెప్పిన మాటలు ఆయనలో బలంగా నాటుకుంటాయి. పోలీస్ స్టేషన్ లో రాత్రివేళలో డ్యూటీ పడినప్పుడు ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనేదే కథ. గిబ్రాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కిరణ్ అబ్బవరం జోడీగా నువేక్ష .. కోమలి ప్రసాద్ తెలుగు తెరకి కథానాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa