ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ స్టార్‌ 7 ఆర్ట్స్ సరయు పై కేసు నమోదు

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 01:16 PM

బిగ్‌బాస్‌ను దమ్ దమ్ చేస్తానంటూ తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సరయు మీకు గుర్తుండే ఉంటుంది. 7 ఆర్ట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి, అడల్డ్ వీడియోలు పోస్ట్ చేసే ఆమెకు ఓ వర్గం ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే అత్యుత్సాహంతో ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన పనులు ఆమె నెత్తి మీదకు తెచ్చాయి. ఆమెకు షాకిస్తూ పోలీస్ ‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
ఇటీవల యూట్యూబ్ నటి సరయు ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొంది. హోటల్ ప్రమోషన్‌లో భాగంగా గణపతిబప్పా మోరియా బ్యాండ్‌ను తన స్నేహితులతో పాటు తలకు ధరించుకుంది. దీనిపై హిందు సంఘాలు మండిపడ్డాయి. ఆ చర్యలు తమ మనోభావాలను దెబ్బతీయడమేనని విశ్వహిందూ పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అశోక్ పేర్కొన్నారు. దేవుడి బొమ్మలతో తప్పతాగి హోటళ్లకు వెళ్తారనే విధంగా సరయు, ఆమె మిత్రులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో అశోక్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ కేసు సిరిసిల్ల నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa