పవన్ కళ్యాత్ తో సాగిన చర్చపై సంగీత దర్శకుడు మదన్ కార్కీ తన అనుభూతులను ట్విట్టర్ లో షేర్ చేసి ఆనందం వ్యక్తంచేశాడు. కోలీవుడ్ సినీ గీత, కథా రచయిత మదన్ కార్కీ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనతో భేటీ ఎంత ఉల్లాసంగా సాగిందో కార్కీ ట్విట్టర్ లో వెల్లడించారు. పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలావుంటే దర్శకుడు క్రిష్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, రచయిత కణ్ణన్ లతో కలిసి మదన్ కార్కీ నేడు పవన్ కల్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఈ భేటీపై కార్కీ స్పందిస్తూ... "పవన్ కల్యాణ్ సర్ తో సాహిత్యం, రాజకీయాలు, మానవ వికాసం, భాషలు వంటి అంశాలపై ఎంతో లోతైన చర్చ జరిగింది. ఆయన కొత్త చిత్రం కోసం పాటలు, డైలాగులపై ఆసక్తికర రీతిలో చర్చించాం" అని వివరించారు. పవన్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా మదన్ కార్కీ ట్విట్టర్ లో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa