ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం లో చోటా కె నాయుడుకు ఊరట... హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 05:35 PM

ప్రముఖ సినిమాటో గ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు విషయంలో తెలంగాణ హై కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో సినీ నటి భీమిరెడ్డి శ్రీసుధతో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు సహజీవనం చేయగా, ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరిట ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ అప్పట్లో హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును శ్రీసుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ కె నాయుడు ద్వారా తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... శ్రీసుధ పిటిషన్ ను కొట్టివేసింది. బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa