ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ కమెడియన్ ఆరోగ్యం పై సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధ

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 06, 2022, 08:18 PM

తన సహచర నటులపైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతారు అన్న అంశం ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ కమెడియన్ సునీల్ గ్రోవర్ ఆరోగ్య పరిస్థితిపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. కొంతకాలం కిందట సునీల్ గ్రోవర్ కు హార్ట్ సర్జరీ జరిగింది. గుండెకు రక్తప్రసరణ చేసే ధమనులు మూసుకుపోయాయి. దాంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అతడికి  కరోనా కూడా సోకింది.  ఇటీవల కరోనా నుంచి కోలుకోవడంతో సునీల్ గ్రోవర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. గ్రోవర్ పరిస్థితి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ అతడి ఆరోగ్యంపై నిత్యం గమనిస్తుండాలని తన వ్యక్తిగత వైద్యుల బృందానికి సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తుండాలని స్పష్టం చేశాడు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భరత్ చిత్రంలో సునీల్ గ్రోవర్ కూడా నటించాడు. ఆ సమయంలో సల్మాన్ కు సునీల్ అత్యంత సన్నిహితుడయ్యాడు. సునీల్ గ్రోవర్ కరోనా సోకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా సల్మాన్ అతడి ఆరోగ్యంపై తరచుగా వాకబు చేసేవాడని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa