ఈ వారం థియేటర్, ఓటీటీలో చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో ఖిలాడీ లాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఖిలాడీ: రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఇందులో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలవగా మంచి స్పందన వస్తోంది.
ఎఫ్‌ఐఆర్: విష్ణు విశాల్ నటిస్తూ స్వయంగా నిర్మించిన 'ఎఫ్.ఐ.ఆర్' సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ నామా తెలుగులో విడుదల చేస్తున్నారు.
సెహరి: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన సినిమా 'సెహరి'. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
డీజే టిల్లు:సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ఇది. నేహాశెట్టి హీరోయిన్ గా నటించగా, విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
వీటితో పాటు 'మహా ప్రళయం-2022' అనే హాలీవుడ్ సినిమా, 'రచ్చ రచ్చ' అనే మరో సినిమా కూడా విడుదల కానున్నాయి.
* ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే: ,మహాన్ ,భామాకలాపం ,గెహ్రాహియా, మళ్లీ మొదలైంది సినిమాలు రానున్నాయి.
.అమెజాన్ ప్రైమ్: - ఐ వాంట్ యూ బ్యాక్(హాలీవుడ్ ఫిబ్రవరి 11)
నెట్‌ఫ్లిక్స్" *:క్యాచింగ్ కిల్లర్స్ (వెబ్ సిరీస్ సీజన్-2) ఫిబ్రవరి 9 , ఇన్వెంటింగ్ అన్నా (వెబ్ సిరీస్) ఫిబ్రవరి11 , లవ్ అండ్ లీషెస్ (కొరియన్) ఫిబ్రవరి 11
, టాల్ గర్ల్ (హాలీవుడ్) ఫిబ్రవరి11, ద ప్రివిలేజి (హాలీవుడ్)ఫిబ్రవరి11.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: * స్నో డ్రాప్ (కొరియన్ సిరీస్) ఫిబ్రవరి 9
జీ5: * సింగ పెన్నే (తమిళ్) ఫిబ్రవరి 9
సోనీ లివ్: ఫ్రీడమ్ ఫైట్ (మలయాళం) ఫిబ్రవరి 11
ఎంక్స్ ప్లేయర్: రక్తాంచల్ (హిందీ) ఫిబ్రవరి 11
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa