కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని రోమియో జూలియట్ పాటను విడుదల చేయనున్నారు. అందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విజయవాడలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా విజయవాడ చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa