ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా టికెట్స్ వివాదం.. రేపు సీఎం జగన్‌తో భేటీకి మహేష్, ప్రభాస్?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 08:05 PM

ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుతో గతేడాది ప్రారంభమైన వివాదానికి త్వరలో తెరపడనుంది. గురువారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోని వివిధ రంగాల పెద్దల అభిప్రాయాలను చిరు సేకరించారు. అంతేకాకుండా దర్శకులు, నిర్మాతలు ఆయా రంగాల పెద్దలతో కలిసి సీఎంతో సమావేశం కానున్నారు. అయితే సీఎంను కలిసే వారిలో అగ్రహీరోలు ప్రభాస్, మహేష్ కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో భారీ బడ్జెట్ సినిమాలన్నీ విడుదల కానున్నాయి. ఆయా సినిమాలకు విడుదల తేదీలను కూడా మేకర్లు ప్రకటించారు. సీఎం నుంచి సానుకూల నిర్ణయం వస్తే మొత్తంగా ఇండస్ట్రీకి లబ్ధి చేకూరుతుందని సినీ పెద్దలంతా భావిస్తున్నారు. తాజాగా ఈరోజు మళ్లీ ఏపీ మంత్రి పేర్నినాని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన ప్రతిపాదనలను సీఎం ముందు మంత్రి ఉంచినట్లు చర్చ సాగుతోంది. టికెట్ ధరలను పెంచితేనే బాగుటుందనే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై రేపు సీఎంతో సినీ పెద్దల భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa