మన టాలీవుడ్ మాస్ హీరోస్ లో అపారమైన టాలెంట్ కలిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ హీరోగా ఎదుగుతున్నాడు. అయితే తారక్ మాత్రం ఎప్పటికప్పుడు తన నటనా చాతుర్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు.అయితే ఇప్పుడు తన నటనే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని మెస్మరైజ్ చేసింది. ఆమెనే బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన దీపికా పదుకొనె. ఇపుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “ప్రాజెక్ట్ కే” అనే భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న ఈమె లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను అయితే టాలీవుడ్ లో హీరోల్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ లతో వర్క్ చెయ్యాలి అనుకుంటున్నానని కాకపోతే ఒకింత ఎక్కువ ఎన్టీఆర్ తో వర్క్ చేసేందుకు బాగా ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపింది. దీనితో ఈ మాటలు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
@deepikapadukone about @tarak9999 I would love to work with Jr.NTR and I'm obsessed with Jr.NTR at this point.. pic.twitter.com/iCeGR5Ot3t
— Jr NTR (@ntrfollower29) February 10, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa