ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 25 వ తేదీనే..బీమ్లా నాయక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 01:05 PM

బీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో, పవన్ సరసన నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. ఆ తరువాత ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఆ తరువాత జరిగిన సర్దుబాట్లలో వీలైతే ఫిబ్రవరి 25కి .. లేదంటే ఏప్రిల్ 1వ తేదీకి అన్నట్టుగా చెప్పారు. దాంతో దాదాపు ఈ సినిమా ఏప్రిల్లోనే ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఈ నెలలో ముందుగా చెప్పిన తేదీనే రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయనీ, త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్లు అంచనాలను పెంచేశాయి. తమన్ బాణీలు పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలో పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa