ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1 మిలియన్ వ్యూస్ సాధించిన "ఆడవాళ్ళు మీకు జోహార్లు" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 12:18 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా  నాన్-థియేట్రికల్  రైట్స్  రూ.25 కోట్లకు సేల్ అయ్యింది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ సినిమా టీజర్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు.1 నిమిషం 31 సెకన్ల టీజర్  వీడియో  పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంది.24 గంటల్లోనే ఈ టీజర్ కి  అత్యధికంగా 69,000 లైక్‌లు , యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సాధించింది.ఈ సినిమా టీజర్  హ్యూమరస్ ట్రాక్ లో ఉంది ,శర్వా కామెడీ టైమింగ్ కూడా ఈ మూవీ కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల ఇంప్రెస్సివె గా  ఉంది అని భావిస్తున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa