కరోనా కారణంగా కొంత కాలంగా థియేటర్స్‌లో సందడి అనేది లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్న కారణంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.టాలీవుడ్‌లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీన రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం, ఫిబ్రవరి 12వ తేదీన సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, తమిళ నటుడు విష్ణు విశాల్ నటించిన FIR, మరో చిన్న చిత్రం సెహారి రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది, ప్రియమణి నటించిన భామా కలాపం కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.రవితేజ ఖిలాడీ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది . తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో డింపుల్ హయత్, మీనాక్షి తదితరులు నటించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించగా, రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగడంతో సినీ, ప్రేక్షక వర్గాల్లో ఖిలాడిపై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా కథ ఎలా ఉంది అంటే..!
కథ :ఖిలాడీ చిత్రం పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇందులో పూర్తిగా యాక్షన్ సీన్స్, పంచ్‌లతో నిండిపోయి ఉంది. రవితేజ ఈ సినిమాలో ఓ గ్యాంబ్లర్.. అంటే పెద్ద ఖిలాడీ మోహన్ గాంధీ పాత్రలో నటించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్జ కనిపించారు. హీరోయిన్ గా డింపుల్ హయతీ నటించారు. మనీ కంటెయినర్ ను మోహన్ గాంధీ దోచుకోవడంతో కథ స్టార్ట్ వుతుంది. పోలీస్ ఆఫీసర్ తో పాటు సినిమాలో విలన్లు కూడా ఆ కంటెయినర్ కోసం వెతుకుతుంటారు. మోహన్ గాంధీ. ఆ మనీ కంటెయినర్ లోనే కూర్చొని పోలీస్, విలన్లకు సవాల్ విసురుతుంటాడు.. సినిమాలో అంతర్లీనంగా ఉన్న మెయిన్ కాన్సెప్ట్ తెలియాలంటే మూవీ చూడాల్సిందే
నటీనటల పర్‌ఫార్మెన్స్:
ఎప్పటిలాగానే మాస్ మహారాజ్ రవితేజ పెర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. రవితేజ్ మార్క్ డైలాగ్స్.. ఆయన మార్క్ మ్యానరిజంతో దూసుకుపోయాడంటున్నారు ఆడియన్స్. అటు ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ పర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఆయన ఏ పాత్ర చేసినా.. తన పర్ఫామెన్స్ తో అదరగొడతాడంటున్నారు ఫ్యాన్స్.ఈమూవీకి స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్లు మీనాక్షీ చౌదరి, డింపుల్ హయత్ మారిపోయారు ఖిలాడికి అదిరిపోయేలా గ్లామర్ అద్దరు ఈ ఇద్దరు భామలు. ఆడియన్స్ ను థియేటర్ లో లాక్ చేసేలా.. ఈ ఇద్దరు బ్యూటీల పెర్ఫామెన్స్ ఖిలాడికి కలిసొచ్చిందనే అంటున్నారు. మిగతా పాత్రలు కూడా అలరిస్తాయి.
Raviteja Khiladi Movie Review and Rating
టెక్నికల్ పర్‌ఫార్మెన్స్:
దర్శకుడు సినిమాని అద్భుతంగా నడిపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కొంత స్లో నరేషన్‌తో సినిమా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు ఇతర పాత్రలపై కూడా పూర్తి దృష్టి పెడితే సినిమా మరింతగా అలరించేదని చెబుతున్నారు.
ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన
స్క్రీన్ ప్లే
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
పేలవమైన కథ
సినిమాటోగ్రఫీ
పోస్ట్ ప్రొడక్షన్
విశ్లేషణ: ప్రస్తుతం ఖిలాడీకి పోటీగా పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక అలరించేలా కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలని ఎక్కువగా ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది. ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో మరో హిట్‌గా నిలుస్తుంది. మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా ఇది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa