ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా రివ్యూ: 'మళ్ళీ మొదలైంది'

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 02:21 PM

టీజీ.కీర్తి కుమార్‌ దర్శకత్వంలో సుమంత్‌, నైనా గంగూలీ నటించిన 'మళ్ళీ మొదలైంది' సినిమా జీ5 ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో వర్షిణీ సౌందర్‌ రాజన్‌, సుహాసినీ, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.
విడాకుల తర్వాత ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందన్న అంశాన్ని తీసుకొని ఈ సినిమాను తెరెక్కించారు. విడాకులు తీసుకున్న వారిని సమాజం ఏ విధంగా చూస్తుందో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రెండో పెళ్లి అనే ఒక సోషల్‌ ఎలిమెంట్‌ ను చూపించారు.
కథలోకి వెళ్తే విక్రమ్‌ (సుమంత్‌) ఒక చెఫ్‌. తనకు నచ్చిన అమ్మాయి నిషా (వర్షిణీ సౌందర్‌రాజన్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత నిషాతో విడాకులు ఇప్పించిన లాయర్ పవిత్ర (నైనా గంగూలీ)ను విక్రమ్ ప్రేమిస్తాడు. కానీ, వివాహమైన తర్వాత మళ్లీ గొడవలై విడాకుల వరకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతుంటాడు. ప్రేమ విషయం తెలుసుకొని పవిత్ర అతడిని దూరం పెడుతుంది. మరి విక్రమ్ పవిత్రను వివాహం చేసుకుంటాడా? అనేది సినిమా చూసే తెలుస్తుంది.
విక్రమ్‌ పాత్రలో సుమంత్‌ ఒదిగిపోయాడు. నైనా గంగూలీ తన పాత్రకి న్యాయం చేసింది. యాంకర్ వర్షిణీ సౌందర్‌రాజన్‌ కూడా తన నటనతో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్‌ కనిపించినంత సేపు నవ్విస్తాడు. మిగతా నటీనటులు పరిధి మేరకు నటించారు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నట్లు అనిపిస్తాయి. సుమంత్‌ నటన, డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, స్లో నరేషన్‌ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా అని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa