ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీనియర్ నటుడికి తీవ్ర అస్వస్థత

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 02:23 PM
బాలీవుడ్ మరియు మరాఠీ వెటరన్ సీనియర్ నటుడు అమోల్ పాలేకర్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా ఈయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని పూనెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అమోల్ పాలేకర్ విషయానికొస్తే 1944 నవంబర్ 24న అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో జన్మించారు. ఈయన జేజే ఫైన్ అండ్ ఆర్ట్స్ ‌లో చదువుకున్నారు. 77 ఏళ్ల ఈ నటుడు ముఖ్యంగా హిందీ, మరాఠీల్లో తెరకెక్కిన ఎన్నో కమర్షియల్, మరియు సమాంతర చిత్రాల్లో నటించారు. స్టేజ్ యాక్టర్‌గా ఈయన పాపులర్ అయ్యారు. ముఖ్యంగా పారలల్ సినిమా నటుడిగా ఈయనకు ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. అటు టెలివిజన్ షోస్ కూడా చేశారు. రజినీగంథ, చిచ్చోర్, గోల్‌మాల్’, శ్రీమాన్ శ్రీమతి, , చోటీసీ బాత్’ సినిమాలు ఈయనకు నటుడిగా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa