ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిజాబ్‌కు మద్దతు తెలిపిన ప్రముఖ హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 05:19 PM
కర్ణాటకలో ఏర్పడిన హిజాబ్ వివాదంపై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సోషల్ మీడియా వేదికగా శుక్రవారం స్పందించింది. తలపాగా ధరించితే లేనిది హిజాబ్ ధరిస్తే ఎందుకు వివాదమైందని ప్రశ్నించింది. బాలికలు, మహిళలకు వారికిష్టమైన దుస్తులను ధరించే హక్కు ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా హిజాబ్‌పై నటి కంగనా రనౌత్ సైతం సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ధైర్యం చూపించాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో బురఖా మానేయాలని సూచించింది. విముక్తి పొందాలని, మిమ్మల్ని మీరు పంజరంలో పెట్టుకోవద్దని సలహా ఇచ్చింది. పనిలోపనిగా ఒక ఈత దుస్తులతో ఉన్న మహిళ ఫొటో, బురఖాలతో ఉన్న మహిళల ఫొటోను షేర్ చేసింది. ఇక కర్నాటక ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్‌పై నిషేధం విధించడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక విద్యా చట్టం-1983లోని 133 (2) ప్రకారం యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. సుప్రీం కోర్టు సైతం స్పందిస్తూ, వివాదాన్ని పెద్దది చేయొద్దని సూచించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa