సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన 'బంగార్రాజు' సంక్రాంతికి విడుదలైంది. నాగార్జున సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 18 నుంచి జీ5లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా జీ5 ట్రైలర్‌ను విడుదల చేసింది. లవ్.. యాక్షన్.. ఎమోషన్.. సస్పెన్స్.. కథను నలువైపులా కవర్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా OTTలో ఎలాంటి రెస్పాన్స్‌ని అందుకుంటుందో చూడాలి.
అక్కినేని నాగేశ్వర్ రావుతో పల్లెటూరి నేపథ్యంలో తీసిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. అలాగే నాగార్జునకు గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా భారీ విజయాన్ని అందించాయి. ఈ జాబితాలో 'జానకి రాముడు' .. 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం', 'అల్లరి అల్లుడు' ఉన్నాయి. ఇక నాగార్జున పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' అతని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa