ప్రముఖ మలయాళీ నటుడు నివిన్ పౌలీ హీరోగా నటించిన సినిమా 'మహా వీర్యార్'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం.ఈ సినిమాలో అసిఫ్ అలీ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నివిన్ పౌలీ, తన హోమ్ బ్యానర్ పౌలీ జూనియర్ పిక్చర్స్‌పై మరియు ఇండియన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పిఎస్ షమ్నాస్ సంయుక్తంగా నిర్మించారు.కొచ్చిన్‌లో జరిగిన కార్యక్రమంలో రచయిత ఎం ముకుందన్ ఈ చిత్రం నుండి మొదటి పోస్టర్‌ను విడుదల చేశారు. స్క్రీన్ రైటర్ మరియు దర్శకుడు అబ్రిడ్ షైన్, నటులు ఆసిఫ్ అలీ, శాన్వి శ్రీవాస్తవ మరియు సహ నిర్మాత పిఎస్ షమ్నాస్ కూడా హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa