ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునీత్ "జేమ్స్ "టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 11:23 AM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం "జేమ్స్ "మూవీ రిలీజ్ కోసం సినిమా లవర్స్ అండ్ పునీత్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.ఈ టీజర్ లో  పవర్ ని సొంతం చేసుకోవాలనే  డార్క్ వరల్డ్ మాఫియాను 'J వింగ్స్' అనే ఏజెన్సీ కోసం పనిచేసే  జేమ్స్‌ ఎలా ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తుంది అని తెలుస్తుంది.చేతన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 17న పునీత్ పుట్టిన రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.ప్రియా ఆనంద్ ఈ సినిమాలో పునీత్ సరసన నటిస్తుంది . శ్రీకాంత్‌, శరత్‌కుమార్‌, ఆదిత్య మీనన్‌  కీలక పాత్రలు పోషించారు. శివ రాజ్‌కుమార్ ,రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఈ సినిమాలో అతిధి పాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa